తెలంగాణలో 24 జిల్లాలు ఉంటాయి: కేసీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో 24 జిల్లాలు ఉంటాయి: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గజ్వేల్ లో ఆయన మాట్లాడుతూ, ప్రతి జిల్లాకు ఒక నిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి ఆసుపత్రిలోను ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ఉచిత వైద్యం అందిస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో కమతాల ఏకీకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు.

చిన్న, సన్నకారు రైతులు కమతాలు ఏర్పాటు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫిజులో రాయతీ ఇస్తామని ఆయన తెలిపారు. కేవలం గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కోసం తన వద్ద ఒక పీఏ ఉంటాడని, అర్థరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా ఎప్పుడే సమస్య వచ్చినా తన వద్దకు రావొచ్చిని ఆయన సూచించారు.

More Telugu News