మరణంలోనూ కలసే పయనించారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరణంలోనూ కలసే పయనించారు!

ఇన్నాళ్ళూ కలసి జీవించిన ఆ అన్న, చెల్లి మరణంలోనూ కలసే పయనించారు. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ హృదయ విదారక ఘటన విజయవాడ-హైదరాబాదు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కట్టంగూరు సమీపంలో బైక్ పై రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ గరుడ బస్సు ఢీకొట్టింది. చనిపోయిన వారు మేకల కృష్ణ, అతని చెల్లెలుగా గుర్తించారు. వారు నల్గొండ జిల్లా ఆజాలబావికి చెందిన వారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News