అరుణ్ జైట్లీపై పరువు నష్టం కేసు వాపసు
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై వేసిన పరువు నష్టం దావా కేసును హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ ఉపసంహరించుకున్నారు. వీరభద్ర సింగ్ జనవరిలో మాజీ ముఖ్యమంత్రి పీకే ధుమాల్, ఆయన కుమారుడు అనురాగ్ ఠాకూర్, బీజేపీ నేత అరుణ్ జైట్లీలపై పరువు నష్టం దావా వేశారు. అయితే, ఇవాళ జైట్లీపై వేసిన కేసును మాత్రం ఆయన వెనక్కి తీసుకున్నారు.