ఆమ్ వే సీఈవోకు 14 రోజుల రిమాండ్ విధించిన ఖమ్మం కోర్టు
చీటింగ్ కేసులో ఆమ్ వే సీఈవో విలియం పింక్నీని ఖమ్మం కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని వరంగల్ జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... గొలుసుకట్టు పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడంటూ... ఖమ్మం వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదైంది. దీంతో, కడప జైల్లో ఉన్న విలియం ను పీటీ వారెంటు మీద ఖమ్మం తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు.