పౌర హక్కుల కోసం 13 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల నూతన ప్రధాని మోడీని కలవాలనుకుంటోంది. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేయాలన్నది ఆమె ఏకైక డిమాండ్. ఈ విషయంలో మోడీని కలసి సహకారం కోరాలని ఆమె అనుకుంటోంది. మోడీని కలిసేందుకు ప్రయత్నిస్తానని, మణిపూర్ లో అమల్లో ఉన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం వల్ల స్థానికులు పడే ఇబ్బందులను వివరిస్తానని ఇరోమ్ మీడియాకు తెలిపారు. ఈ చట్టాన్ని ఎత్తివేయాలని కోరతానన్నారు. ఇదే డిమాండ్ తో ఇరోమ్ 2000 సంవత్సరం నవంబర్ లో నిరాహార దీక్ష చేపట్టి నేటికీ కొనసాగిస్తున్నారు.