ఒక్క అవకాశం ఇవ్వండి... టీమిండియాలో చోటు కొట్టేస్తా: ఆవానా
స్పీడ్ స్టర్ పోటీల ద్వారా అత్యంత వేగవంతమైన బౌలర్ గా వెలుగులోకి వచ్చిన పర్వీందర్ ఆవానా టీమిండియా ఇంగ్లాండ్ టూర్ జట్టులో చోటుపై ఆశలు పెట్టుకున్నాడు. ఐపీఎల్ 7లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు ఆడుతున్న అవానా ఆ జట్టు కోచ్ డౌ జోన్స్ తో సరదగా మాట్లాడుతూ, 'నన్ను మిగిలిన అన్ని మ్యాచ్ లకు ఆడిస్తే ప్రతి మ్యాచ్ లో ఐదేసి వికెట్లు తీస్తా...ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కుతా' అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. కేవలం వేగాన్ని నమ్ముకుంటే సరిపోదని భావించిన అవానా తన బౌలింగ్ లోపాల్ని, బౌలింగ్ లో వైవిధ్యాన్ని జత చేయడం సహచరులు మిషెల్ జాన్సన్ వద్ద నేర్చుకుంటున్నాడు.