వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంట్లో టైం బాంబ్ కలకలం
అనంతపురం జిల్లా బండ్లపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకటశివప్ప ఇంట్లో టైం బాంబు కలకలం రేపింది. ఈ తెల్లవారు జామున 4 గంటల సమయంలో మోటార్ ఆన్ చేసేందుకు బయటకు వచ్చిన వెంకటశివప్ప ఇంట్లో టైం బాంబ్ పెట్టిన విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారమందించారు. దీంతో చిలమత్తూరు నుంచి పోలీసులు వచ్చి బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి నిర్వీర్యం చేయించారు. శివప్ప ప్రత్యర్థులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.