ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న దత్తన్న
నరేంద్ర మోడీ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్న బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఆయనకు బీజేపీ అగ్రనేతల నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హస్తిన బయలుదేరుతున్నారు.