59 మంది భారత ఖైదీలను విడుదల చేసిన పాక్
పాకిస్థాన్ 59 మంది భారతీయ ఖైదీలను ఈ రోజు విడుదల చేసింది. ప్రధాని నవాజ్ షరీఫ్ భారత పర్యటనకు ముందు స్నేహపూర్వకంగా తీసుకున్న నిర్ణయం మేరకు వీరి విడుదల జరిగింది. కరాచీ జైళ్లలో మగ్గుతున్న భారత ఖైదీలను పాక్ అధికారులు రేపు వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించనున్నారు. వీరిలో ఎక్కువ మంది జాలర్లే. పాక్ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించినందుకు వీరిని ఆ దేశ కోస్ట్ గార్డు విభాగం అరెస్ట్ చేసింది.