Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆరోగ్యశ్రీ'పై బెదిరిస్తే కుదరదు : మంత్రి కొండ్రు మురళి

డిమాండ్లు నెరవేర్చకపోతే తమ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటూ యాజమాన్యాలు ఇచ్చిన అల్టిమేటమ్ మీద ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ వల్ల ఎక్కువ లబ్ది పొందింది ప్రయివేటు ఆసుపత్రులేనన్నారు. ప్రభుత్వాన్ని బెదిరించి లాభపడదామనుకుంటే కుదరదని మంత్రి తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కోసం ఏటా పెద్దమొత్తంలో ఖర్చు చేస్తుందన్నారు.
 
కాగా, ఆరోగ్యశ్రీ టారిఫ్స్ పెంచకపోతే వచ్చే నెల 3వతేదీ నుంచి సర్వీసులు నిలిపివేస్తామని నిన్న ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ఈ సాయంత్రం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ భవన్ లో ఆసుపత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరుపనుంది. 

More Telugu News