క్యాబ్ రిజిస్ట్రేషన్ చేయించుకోనివారికి రూ. 500 జరిమానా: సీీపీ ఆనంద్
సైబరాబాద్ పరిధిలోని క్యాబ్ లన్నింటికీ రిజిస్ట్రేషన్ తప్పని సరి అని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని క్యాబ్ లకు రూ. 500 జరిమానా విధిస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న క్యాబ్ లకు భద్రత చిహ్నంగా స్టిక్కరును కేటాయిస్తామని తెలిపారు. అభయ ఘటన తర్వాత ఐటీ కంపెనీల పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశామని... రూ. 6 కోట్లతో సీసీటీవీల ఏర్పాటుతో పాటు 80 మంది ప్రత్యేక సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. సైబరాబాద్ లో క్యాబ్ రిజిస్ట్రేషన్ సెంటర్ ఏర్పాటు సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు.