త్వరలో విజయవాడ 'సడక్ బంద్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్వరలో విజయవాడ 'సడక్ బంద్'

త్వరలోనే విజయవాడ 'సడక్ బంద్' నిర్వహించనున్నట్టు తెలంగాణ జేఏసీ కన్వీనర్ ఫ్రొ. కోదండరాం చెప్పారు. తేదీలను ఖరారు చేసేందుకు ఏప్రిల్ 3న మళ్ళీ సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈరోజు తెలంగాణ పొలిటికల్ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇంతకుముందు నిర్వహించిన బెంగళూరు సడక్ బంద్ లోటుపాట్లను భవిష్యత్తులో పునరావృతం కానివ్వబోమని అన్నారు. ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఏప్రిల్ మొదటి వారంలో జరిగే సమావేశంలో సడక్ బంద్, చలో అసెంబ్లీ తేదీలను ఖరారు చేస్తామని పేర్కొన్నారు. 

More Telugu News