: విశాఖలో కన్నుల పండువగా సీతారామ కల్యాణోత్సవం
విశాఖపట్నం నగరంలో శ్రీరామనవమి వేడుకలు కన్నులపండువగా సాగాయి. రామ్ నగర్ లో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎంవీపీ కాలనీలో నిర్వహించిన నవమి వేడుకల్లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు దంపతులు హాజరయ్యారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన నవమి వేడుకల్లో విశాఖ పోలీస్ కమిషనర్ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.