ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ
ఉద్యోగాలిప్పిస్తానంటూ ఓ ప్రబుద్దుడు నిరుద్యోగులను మోసం చేసి 40 లక్షలు కాజేశాడు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 40 మంది నుంచి 40 లక్షలు వసూలు చేసిన సదరు కిరణ్ అనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.