బెయిల్ పై విడుదలైన నిమ్స్ వైద్యుడు శేషగిరిరావు
హైదరాబాద్ నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతి డా.శేషగిరిరావు బెయిల్ పై విడుదలయ్యారు. 50వేల రూపాయలతో బాటు, ఇద్దరి పూచీకత్తుతో నిన్న ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గుండె ఆపరేషన్లలో ఉపయోగించే స్టెంట్ల కొనుగోలు వ్యవహారంలో నిమ్స్ ఆసుపత్రిలో లంచం తీసుకుంటూ గత నెలలో శేషగిరిరావు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. అప్పటినుంచి ఆయన చర్డపల్లి జైలులో రిమాండులో ఉన్నారు.