రాహుల్ కు వ్యతిరేకంగా తమ్ముడు ప్రచారం చేయడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ కు వ్యతిరేకంగా తమ్ముడు ప్రచారం చేయడట!

బీజేపీ జాతీయ కార్యదర్శి వరుణ్ గాంధీ (34) ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రచారం చేయబోనని స్పష్టం చేశారు. రాహుల్ అమేథీ లోక్ సభ స్థానం నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వరుణ్ సుల్తాన్ పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయాల పట్ల తనకు సానుకూల దృక్పథం ఉందని, కొన్ని విషయాల్లో హద్దులు మీరబోనని మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. వరుణ్ గాంధీ సోనియా తోడికోడలు మేనకా గాంధీ తనయుడన్న సంగతి తెలిసిన విషయమే.

More Telugu News