పాక్ కోచ్ పదవి నాకొద్దు బాబోయ్: యూనిస్ ఖాన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ కోచ్ పదవి అంటే హడలిపోతున్నాడు. ప్రతి సిరీస్ అనంతరం హెడ్ కోచ్ కు పదవీ గండం సంప్రాప్తించడం పాక్ లో పరిపాటి! ఇటీవలే డేవిడ్ వాట్ మోర్ ను సాగనంపి స్వదేశీ మొయిన్ ఖాన్ వైపు మొగ్గు చూపారు. ఆసియా కప్ ఫైనల్లో ఓటమి అనంతరం ఖాన్ పైనా విమర్శలు వెల్లువెత్తాయి. వసీం అక్రం లాంటి బౌలింగ్ దిగ్గజం ప్రస్తుతం పాక్ జట్టుకు దూకుడైన కోచ్ కావాలంటున్నాడు. ఈ నేపథ్యంలో మీడియా యూనిస్ ఖాన్ ముందు కోచ్ పదవిపై ప్రస్తావించగా, వద్దేవద్దని కరాఖండీగా చెప్పేశాడు.
'పాకిస్తాన్ క్రికెట్లో కోచింగ్ చాలా కష్టమైన పని. పాక్ జట్టుకు ఓ ఆటగాడిగా మెరుగైన సేవలందించానన్న తృప్తితో గౌరవప్రదంగా రిటైరవ్వాలని భావిస్తాను. నేనిప్పటికీ వన్డే క్రికెట్ కు సరిపోతాననే భావిస్తున్నా. అవకాశం వస్తే సత్తా నిరూపించుకుంటా. కోచ్ పదవిపై మాత్రం ఆసక్తిలేదు' అని స్పష్టం చేశాడు. ఇక వన్డే వరల్డ్ కప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పిచ్ లపై జరగనున్న నేపథ్యంలో ఎక్కడైనా సమస్యలేదన్నాడు.