Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘మనం’ సినిమా పాటలను ఇంటర్ నెట్లో పెట్టారు... ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు

అక్కినేని కుటుంబంలోని మూడు తరాల వారు కలిసి నటించిన ‘మనం’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేసే పనిలో నిర్మాతలున్నారు. దివంగత అక్కినేని నాగేశ్వరరావుతో పాటు అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

కాగా,‘మనం’ సినిమాలోని కొన్ని భాగాలను ఇంటర్ నెట్ లో అప్ లోడ్ చేయడంతో కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులు యూ ట్యూబ్ లో ‘మనం’ సినిమాలోని పాటలను ఎక్కించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఇందుకు బాధ్యులైన ఇద్దరినీ అరెస్ట్ చేసి... వారిని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News