డీఎస్పీ మరో మహిళతో సహజీవనం... రోడ్డెక్కిన భార్య!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డీఎస్పీ మరో మహిళతో సహజీవనం... రోడ్డెక్కిన భార్య!

సమాజాన్ని సరైన దారిలో పెట్టాల్సిన ఆ పోలీసు అధికారి దారి తప్పాడు. కట్టుకున్న భార్యను, పిల్లలను గాలికొదిలేసి మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. దీంతో రుద్రకాళి అయిన ఆయన భార్య రోడ్డెక్కి రచ్చరచ్చ చేసేసింది. వివరాల్లోకి వెళితే, విజయవాడలో డీఎస్పీగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు మరో మహిళతో సంబంధం పెట్టుకుని, ఆమె దగ్గరే మకాం పెట్టేశాడు. భార్య భూదేవి, పిల్లలను వారి దారిన వాళ్లను వదిలేశాడు.

దీంతో భూదేవి ఈ రోజు వెంకటేశ్వరరావు ఉన్న చోటుకు వెళ్లి నానా హంగామా సృష్టించింది. ఆమెకు తోడుగా మహిళా సంఘాలు కూడా డీఎస్పీ బాగోతాన్ని ఎండగడుతూ, నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో డీఎస్పీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని పటమట పీఎస్ లో వెంకటేశ్వరరావును విచారిస్తున్నారు. మరో మహిళ మోజులో పడి తమను నిర్లక్ష్యం చేస్తున్న తన భర్తను శిక్షించాలని భూదేవి డిమాండ్ చేస్తోంది. అయితే, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలే కాని... ఇలా రోడ్డెక్కి రభస చేయడం మంచిది కాదని సదరు డీఎస్పీ సాబ్ చెప్పడం కొసమెరుపు.

More Telugu News