నేడు ప్రధాని, సోనియాతో భేటీ కానున్న గవర్నర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు ప్రధాని, సోనియాతో భేటీ కానున్న గవర్నర్

గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఢిల్లీలో కీలక భేటీలలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధాని మన్మోహన్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీతో సమావేశమవబోతున్నారు. ఈ మధ్యాహ్నం 11.15 గంటలకు ఆయన ప్రధానితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యవహారాలు, శాంతిభద్రతలకు సంబంధించిన నివేదికను ప్రధానికి సమర్పించనున్నారు. అనంతరం ఆయన సోనియాతో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.

More Telugu News