చరిత్రాత్మక విజయానికి చేరువలో టీం ఇండియా
భారత బ్యాట్స్ మెన్ మంచి ఊపు మీదుండడంతో ఢిల్లీ టెస్ట్ లోనూ విజయం దాసోహమనిపిస్తోంది. దీంతో 5 రోజుల పాటు సాగాల్సిన టెస్ట్ మ్యాచ్ మూడోరోజే ముగిసిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 155 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 127 పరుగులతో ఆట కొనసాగిస్తోంది. ఓపెనర్ పుజారా 64 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. కేవలం మరో 28 పరుగులు మాత్రమే భారత జట్టు సాధిస్తే చరిత్రాత్మక విజయం టీమిండియా వశమౌతుంది.