ప్రధానితో మాట్లాడి నిధులపై హామీ తీసుకుంటాం: సుబ్బరామిరెడ్డి
దిగ్విజయ్ సింగ్ తో కలిసి వెళ్లి ప్రధానితో మాట్లాడి నిధుల అంశంపై హామీ తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధుల కేటాయింపుపై ప్రధానిని కలిశాక స్పష్టతనిస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా తనతో అన్నారని సుబ్బరామిరెడ్డి చెప్పారు. ప్రత్యేక పీసీసీలు, ప్రాంతీయ కమిటీలపై అధిష్ఠానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.