ఆధునిక జీవనశైలి, జనాభా పెరుగుదలే అత్యాచారాలకు కారణం: మమతా బెనర్జీ
దేశంలో అత్యాచారాలు అధికమవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
తనదైన భాష్యం చెప్పారు. ఈ ఘటనలు చోటు చేసుకోవాడానికి కారణం దేశంలో జనాభా
పెరగడమేనని సెలవిచ్చారు. అంతేగాక, ఆధునిక జీవితం కూడా ఇందుకొక కారణమన్నారు. కోల్ కతాలో శుక్రవారం జరిగిన చర్చలో ఆమె ఈ విధంగా మాట్లాడారు.
'వాహనాల సంఖ్య పెరుగుతోంది, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోంది. ఎన్నో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు పుట్టుకొస్తున్నాయి. పిల్లలు ఆధునిక జీవనంవైపు మొగ్గుచూపుతున్నారు. వీటన్నింటినీ మనం స్వాగతించాలి' అన్నారామె.
అలాగే మహిళలకు సంబంధించిన విషయాలు ప్రసారం చేసేటప్పుడు మీడియా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. అయితే ఢిల్లీ, ముంబయ్, బెంగళూరు, చెన్నై మెట్రో సిటీల్లో కన్నా కోల్ కతా నగరంలోనే మహిళలకు భద్రత ఉందని ముఖ్యమంత్రి ముక్తాయించారు.
'వాహనాల సంఖ్య పెరుగుతోంది, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోంది. ఎన్నో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు పుట్టుకొస్తున్నాయి. పిల్లలు ఆధునిక జీవనంవైపు మొగ్గుచూపుతున్నారు. వీటన్నింటి