Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ బాక్సింగ్ ఛాంపియన్ కిడ్నాప్.. హత్య

వెనిజువెలాకు చెందిన బాక్సింగ్ ఛాంపియన్ ఆంటోనియో సెర్మెనోను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హతమార్చారు. 44 ఏళ్ల సెర్మెనోను ఆయన కుటుంబ సభ్యులు సహా సోమవారం కిడ్నాప్ చేశారు. మంగళవారం తూర్పు కారకస్ ప్రాంతంలో ఆయన మృతదేహం జాతీయ రహదారిపై కనిపించింది. దీని పట్ల వెనిజ్యువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో విచారం వ్యక్తం చేశారు.

సెర్మెనో ప్రపంచ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి సూపర్ బాటమ్ వెయిట్, ఫెదర్ వెయిట్ ఛాంపియన్ గా ఉన్నారు. 1980, 90లలోఈ రెండు విభాగాల్లో ఆయనదే రాజ్యం. ఇటీవలి కాలంలో వెనిజువెలాలో హింసాత్మక సంఘటనలు పెరిగిపోయాయి. వాటిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమాలకు సెర్మెనో శిక్షకుడుగా వ్యవహరిస్తున్నారు. తద్వారా యువతను వీధిపోరాటాలకు దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కాగా సెర్మెనో హత్యకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు.

More Telugu News