నన్నపనేని నిమ్స్ కు తరలింపు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్నపనేని నిమ్స్ కు తరలింపు!

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 48 గంటల దీక్ష చేపట్టిన టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నన్నపనేని బీపీ లెవెల్స్ తగ్గటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నన్నపనేని రాజకుమారి రాష్ట్ర విభజనను నిరసిస్తూ మంగళవారం సాయంత్రం శాసనసభ ఆవరణలోని టీడీఎల్పీ కార్యాలయం ఎదుట మెరుపు దీక్ష చేపట్టిన విషయం విదితమే.

విభజన అంశంపై మాట్లాడుతానని మీడియాను ఆహ్వానించిన నన్నపనేని.. అప్పటికప్పుడు 48 గంటల దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించింది. దీంతో కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని.. ఇంటి వద్ద వదిలేశారు. అయితే పోలీసులు దీక్షను భగ్నం చేసినా, పట్టు వీడని నన్నపనేని ఇవాళ ఉదయం టీడీఎల్పీ ఆఫీసుకు చేరుకుని దీక్షను మళ్లీ మొదలుపెట్టారు. అసెంబ్లీ తిరస్కరించిన విభజన బిల్లును రాష్ట్ర పతి ఆమోదించి పార్లమెంటు పంపడం సరికాదని ఆమె విమర్శించారు. అయితే, మధ్యాహ్నం సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్ కు తరలించక తప్పలేదు.

More Telugu News