కులాంతర వివాహం చేసుకుంటాడా? కోటి ఇవ్వాలి..మా పేరు వాడకూడదు: ఓ తండ్రి డిమాండ్
కులాంతర వివాహం చేసుకున్న తన కుమారుడిపై పాట్నా న్యాయస్థానంలో న్యాయవాది సిథ్ నాథ్ శర్మ పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే ... సిథ్ నాథ్ శర్మ కుమారుడు సుశాంత్ గుజరాత్ కేంద్ర ప్రభుత్వోద్యోగి. గత నవంబరులో ఇతను వేరే కులానికి చెందిన బ్యాంకు ఉద్యోగినిని పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లి విషయం తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ, వారు అంగీకరించకపోవడంతో అతను పెళ్లి చేసేసుకున్నాడు.
దీంతో ఆగ్రహించిన సిథ్ నాథ్ 'తాను, తనభార్య ఎన్నో ఏళ్ల పాటు ఎంతో శ్రమించి మరెంతో సమయం వెచ్చించి సుశాంత్ ను ప్రయోజకుడ్ని చేశామని.. అతను కులాంతర వివాహం చేసుకుని తమ నమ్మకాన్ని వమ్ముచేసి తీవ్ర మనస్థాపానికి గురి చేశాడని.. సంఘంలో తలెత్తుకోలేకుండా చేశాడని.. అందుకు తనకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. అంతే కాకుండా, ఇకపై సుశాంత్ ఎక్కడా తన పేరు వాడరాదని.. అలా వాడిన ప్రతిసారీ కాపీ రైట్ ఫీజ్ గా 10 రూపాయల చొప్పున చెల్లించాల్సిందిగా ఆదేశించాలని అన్నారు. గత 400 ఏళ్లలో తమ వంశంలో ఎవరూ చేయని పని చేసి తలవంపులు తెచ్చాడని' వాపోయారు.