చేపల దాడిలో 70 మందికి గాయాలు
చేపే కదా అని తీసి పారేస్తే ఏమవుతుందో చూద్దాం! అది అర్జెంటీనాలోని ప్రముఖ పరానా రివర్ బీచ్. క్రిస్ మస్ కావడంతో సేద తీరడానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. బీచ్ లో దిగి హుషారుగా జలకాలాట మొదలెట్టారు. ఆనందంతో కేరింతలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. ఏమైందో గానీ ఒక్కసారిగా బాధతో, భయంతో అరుపులు మొదలయ్యాయి. నీటిలో స్నానం చేస్తున్న వారిపై చేప గుంపు దాడి చేసి కాలి, చేతి వేళ్లను కాటేశాయి. కొంత మంది వేలి చివరి భాగాలను కొరుక్కుతిన్నాయి. ఈ దాడిలో 70 మందికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ సంతోషం కాస్తా ఆవిరై భయానక వాతావరణం నెలకొంది. వారిపై దాడి చేసినవి కాటేసే చేపలు మరి.