దీంతో సరైన ఆహారాన్ని తినవచ్చు

25-12-2013 Wed 06:54
మీరు మీ శరీరానికి అవసరమైనంత కేలరీలను అందించగల ఆహారాన్ని తీసుకుంటున్నారా...? ఈ విషయంలో ఎవరూ సరిగా సమాధానం చెప్పలేరు. ఒక వ్యక్తి రోజుకు ఇన్ని కేలరీల ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. కానీ ఇలా కేలరీలను లెక్కించి తినగలిగేంత సమయం, అవకాశం ఎవరికీ ఉండదు. అలాకాకుండా అసలు మనం ఏం తింటున్నాము... అందులో ఏవైనా తినగూడని పదార్ధాలున్నాయా... మనం తినే ఆహారం నుండి ఎంతమేర శక్తి, కేలరీలు మనకు లభిస్తాయి? వంటి వివరాలను మనకు అందించేందుకు ఒక కొత్తరకం పరికరం రానుంది. ఈ పరికరాన్ని ఇలా ఆహారంపై తిప్పితే చాలట... అది మనం తినే ఆహారంలో ఉండే క్యాలరీలను, అలాగే అందులో మనకు అలర్జీని కలిగించే కారకాలు ఏవైనా ఉంటే వాటి గురించి, ఒకవేళ పొరబాటున అందులో పురుగుమందు అవశేషాలుంటే వాటి గురించి మనకు ఇట్టే చెప్పేస్తుందట.

టొరంటోకు చెందిన పరిశోధకులు ఒక కొత్తరకం స్కానర్‌ను తయారుచేశారు. ఈ స్కానర్‌ పేరు టెల్‌స్పెక్‌. బుల్లి మౌస్‌లాంటి ఈ స్కానర్‌ను మన ఆహార పళ్లెంపై పెట్టి అలా తిప్పితే చాలు మన పళ్లెంలోని ఆహారం చక్కగా స్కానింగ్‌ అయిపోతుంది. ఈ పరికరం నుండి తక్కువ శక్తిగల లేజర్‌ ఆహారంపై పడుతుంది. లేజర్‌ పడగానే ప్రతిబింబించే కాంతి తరంగాలను ఇది రామన్‌ సెక్ట్రోమీటర్‌ సాయంతో పసిగడుతుంది. ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉండే డేటాబేస్‌కు పంపిస్తుంది. దీంతో అక్కడ విశ్లేషణ పూర్తయి దానికి సంబంధించిన వివరాలను ఒక అప్లికేషన్‌ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు అందుతాయి.

ఈ స్కానర్‌తో మన ఆహారపదార్ధాలను 97.7 శాతం కచ్చితత్వంతో స్కాన్‌ చేయవచ్చట. ఇప్పటి వరకూ దాదాపు మూడు వేల రకాల ఆహారపదార్ధాలను స్కాన్‌ చేసేలాగా డాటాబేస్‌ను రూపొందించామని, ఇది దాదాపుగా అన్ని రకాల ఆహార పదార్ధాలను స్కాన్‌ చేయగలదని దీన్ని తయారుచేసిన ఇసాబెల్‌ హాఫ్‌మన్‌, స్టీఫెన్‌ వాట్సన్‌లు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో మార్కెట్‌లోకి విడుదల చేయనున్న ఈ స్కానర్‌ ధర కేవలం రూ.19,752 మాత్రమే.

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more