హైదరాబాదు నగరంలో ఇవాళ అవినీతికి పాల్పడిన పోలీసు శాఖాధికారి పట్టుబడ్డాడు. నాంపల్లిలో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ 20 వేల రూపాయల లంచం తీసుకొంటూ అవినీతి శాఖాధికారులకు (ఏసీబీ) దొరికిపోయారు. కేసు నుంచి తప్పిస్తానంటూ నిందితుని తండ్రి నుంచి డబ్బు తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని అతనిని అదుపులోకి తీసుకొన్నారు.