కాంగ్రెస్ నుంచి నన్ను పో పో అంటున్నారు: జేసీ దివాకర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నుంచి తనను 'పో పోమ్మని' పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంటున్నారని ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. సోనియాపై వ్యాఖ్యలకు సంబంధించి తనకింకా షోకాజ్ నోటీసు అందలేదని, అందాక స్పందిస్తానన్నారు. సోనియాగాంధీపై జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బొత్స, దిగ్విజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో జేసీకి షోకాజ్ నోటీసు పంపుతామని దిగ్విజయ్ కొన్ని రోజుల కిందటే చెప్పారు. తనకు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల నుంచి ఆహ్వానం అందిందని జేసీ చెప్పారు. 'నా తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, నా కుమారుడు ఏ పార్టీలో చేరతారన్నది వారిష్టమని' చెప్పారు.