మొండి మలేరియాను మట్టుబెట్టవచ్చు
మలేరియా వ్యాధిని నివారించడానికి ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను కనుగొనడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. కానీ ఈ వ్యాధికి సంబంధించిన మలేరియా పరాన్నజీవి చికిత్సకు లొంగినట్టే లొంగి తిరిగి విజృంభిస్తోంది. తాజాగా పరిశోధకులు మలేరియా పరాన్నజీవిని మరింత సమర్ధవంతంగా మట్టుబెట్టడానికి మార్గాన్ని కనుగొన్నారు.
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన పరిశోధకులు మలేరియా పరాన్నజీవిని మట్టుబెట్టడానికి కొత్త పద్ధతిని కనుగొన్నారు. వీరు ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ కొత్త చికిత్సా విధానం విజయవంతమయ్యిందని పరిశోధకులు చెబుతున్నారు. మలేరియా పరాన్నజీవి కణంలోని ఎన్ఎమ్టీ ఎంజైము మలేరియా వ్యాధిని వ్యాపింపజేసే ప్రోటీన్ల ఉత్పత్తికి దోహదం చేస్తోంది. ఈ ఎంజైము కదలికలకు అవరోధం కల్పించడం ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని, ఎన్ఎమ్టీని అడ్డుకునే అణువులపై ప్రస్తుతం పరిశోధనలు సాగిస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.