: పరీక్ష రాస్తున్న డీజీపీ
రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు పరీక్షకు హాజరయ్యారు. డీజీపీ ఏంటి? పరీక్ష రాయడం ఏంటి? అనుకుంటున్నారా. భౌతిక శాస్త్రంలో మన పోలీస్ బాస్ పరిశోధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో 'ప్రీ-పీహెచ్ డీ' పరీక్షకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వృత్తి రీత్యా అత్యున్నత పదవులను అనుభవిస్తున్నా... తాను ఇప్పటికీ నిత్య విద్యార్థినే అంటూ ఆయన గతంలో అనేక సార్లు చెప్పారు.