భారత్ కు పయనమైన రాష్ట్రపతి ప్రణబ్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తిరుగు ప్రయాణమయ్యారు. నెల్సన్ మండేలా స్మారక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ప్రణబ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్, కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ తదితరులతో కూడిన బృందం జోహెన్నెస్ బర్గ్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుముఖం పట్టింది.