కాంగ్రెస్ ‘కామ్ ఖతం’: జేసీ దివాకర్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ ‘కామ్ ఖతం’: జేసీ దివాకర్ రెడ్డి

దేశంలో కాంగ్రెస్ పనైపోయిందని తాను ఇంతకు ముందే చెప్పానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ పైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదన్నారు. అధినేత్రి సోనియా రాజీనామా చేసి, పార్టీ పగ్గాలను కొత్త వారికి అప్పగించడం మేలని ఆయన హితవు పలికారు. అయితే, ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచనేమీ లేదంటూనే.. కొత్తగా వచ్చే పార్టీల్లోకి వెళ్లే విషయం మాత్రం ఆలోచిస్తానన్నారు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించిన జేసీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపేందుకు ప్రయత్నిస్తున్న ఎంపీలను అభినందించారు.

More Telugu News