సూర్యప్రభ వాహనంపై విహరించిన పద్మావతి అమ్మవారు
చిత్తూరు జిల్లా తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఏడోరోజు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం సూర్యప్రభ వాహనంపై అమ్మవారు తిరువీధుల్లో విహరించారు. వైకుంఠ వల్లభనాథుని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్యప్రభ వాహన సేవ కన్నుల పండువగా సాగింది. ఇవాళ రాత్రి అమ్మవారికి చంద్రప్రభ వాహన సేవ జరుగనుంది.