ప్రతిభ తన బహుమతులన్నీ రాష్ట్రపతి భవన్ కే ఇచ్చేశారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రతిభ తన బహుమతులన్నీ రాష్ట్రపతి భవన్ కే ఇచ్చేశారు

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉండగా ఆమెకు లభించిన అధికారిక బహుమతులన్నీ తిరిగి రాష్ట్రపతి భవన్ కు అందజేశారని అధికారులు తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద సుభాష్ అగర్వాల్ అడిగిన ప్రశ్నకు అధికారులు సమాధానమిచ్చారు. ప్రతిభాపాటిల్ కు 155 బహుమతులు వచ్చాయని, వాటిని అమరావతిలోని విద్యాభారతి శైక్షణిక్ మందై పాఠశాలలో ప్రదర్శన కోసం రాష్ట్రపతి భవన్ తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకుందని అధికారులు వెల్లడించారు. అలాగే కలాం రాష్ట్రపతిగా ఉండగా వచ్చిన 36 బహుమతులు తొలుత డీఆర్ డీవోలో ప్రదర్శనకు ఉంచినా, తిరిగి వాటిని రాష్ట్రపతి భవన్ కు అందజేశారని రాష్ట్రపతిభవన్ అధికారులు తెలిపారు.

More Telugu News