ఎంపీ ధనుంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంపీ ధనుంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు

పని మనిషి రాఖీ భద్రను ఈ నెల 5న హత్య చేసిన కేసుకు సంబంధించి బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్, అతని భార్య జాగృతి సింగ్ ల బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. మెజిస్టీరియల్ కోర్టు ఇది వరకే వీరిద్దరికీ బెయిలు తిరస్కరించడంతో నిందితులు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. నిజానిజాలు వినకుండా కింది కోర్టు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిందని సింగ్ సెషన్స్ కోర్టులో వాదనలు వినిపించారు. పని మనిషిని కొట్టేందుకు భార్య జాగృతిని ఎంపీ తరచూ ప్రోత్సహించినందుకు బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో మెజిస్టీరియల్ కోర్టు తీర్పుతో ఏకీభవించిన సెషన్స్ కోర్టు జడ్జి ధర్మేష్ శర్మ వారి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు.

More Telugu News