Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోవా సెషన్స్ కోర్టులో తేజ్ పాల్ కు తాత్కాలిక ఊరట

లైంగిక వేధింపుల కేసులో కొద్దిసేపటి కిందట అరెస్టైన తరుణ్ తేజ్ పాల్ కు గోవా సెషన్స్ కోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. తేజ్ పాల్ ను రేపటి వరకు అరెస్టు చేయవద్దని గోవా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసిన న్యాయస్థానం, విచారణను రేపటికి వాయిదా వేసింది.

More Telugu News