ప్రోరోగ్ పై చర్చే అప్రస్తుతం: కోదండరాం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రోరోగ్ పై చర్చే అప్రస్తుతం: కోదండరాం

రాష్ట్ర విభజన విషయంలో ప్రోరోగ్ అనేది రామాయణంలో పిడకల వేట లాంటిదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రోఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ప్రోరోగ్ పై చర్చే అప్రస్తుతమన్నారు. బ్రిటిష్ వాళ్ల అవసరాలకోసం చేసిన మార్పులను పరిగణనలోకి తీసుకుని భద్రాచలం, మునగాలలను తెలంగాణలోనే కొనసాగించాలని సూచించారు. కాకినాడ నుంచి ఆ ప్రాంతాన్ని నిర్వహించడం సాధ్యం కాదనే అప్పుడు నెహ్రూ చొరవతో భద్రాచలాన్ని తెలంగాణలో కలిపారని గుర్తుచేశారు. అనేక పోరాటాల ఫలితంగా మునగాల తెలంగాణలో కలిసిన విషయాన్ని మరవొద్దని సూచించారు. భద్రాచలం, మునగాలల్లో స్థానికులే తెలంగాణ నుంచి వేరు చేయవద్దని పోరాటాలు చేస్తున్నారని కోదండరాం అన్నారు.

More Telugu News