దక్షిణమధ్య రైల్వే జీఎంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీవాత్సవ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దక్షిణమధ్య రైల్వే జీఎంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీవాత్సవ

దక్షిణ మధ్య రైల్వే నూతన జనరల్ మేనేజర్ గా ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముంబైలోని కేంద్రీయ రైల్వేలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పదోన్నతి మీద ఇక్కడకు బదిలీ చేసింది. ఆయన 1976 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సర్వీసు అధికారి. ఇప్పటి వరకు ఆయన దేశంలోని వివిధ రైల్వే జోన్లలో పలు కీలక హోదాల్లో పనిచేశారు.

More Telugu News