హైదరాబాద్ యూటీకి ఒప్పుకోం: దానం
హైదరాబాద్ ను యూటీ చేస్తామంటే ఒప్పుకోబోమని మంత్రి దానం నాగేందర్ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానాన్ని అమలు చేయాల్సిందేనని అన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని అంటే అభ్యంతరం లేదని, అయితే కీలకమైన శాఖను కేంద్రం పరిథిలో ఉంచుకుంటానంటే మాత్రం సహించమని స్పష్టం చేశారు. దీనిపై ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామన్నారు. తెలంగాణపై సీఎల్పీ తీర్మానం చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ గా ఉన్నారని అందువల్ల తీర్మానాల నిర్ణయాలు ఆయనకు తెలియకపోయి ఉండవచ్చని అన్నారు. మొదటి నుంచి సమైక్యవాదాన్ని వినిపిస్తున్న ముఖ్యమంత్రి పెద్దరాష్ట్రానికి సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు.