కాశ్మీర్ వేర్పాటు వాద నేత గిలానీ మళ్లీ అరెస్ట్
జమ్మూకాశ్మీర్ లో వేర్పాటు వాద నేత సయ్యద్ అలీ గిలానీని పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. గిలానీ గత నెల 29నే గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అయితే, రానున్న లోక్ సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలను బహిష్కరించాలంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు గిలానీని తిరిగి అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచారు.