విమర్శలు చేసుకుని పార్టీ పరువు తీయొద్దు: తమ్ముళ్లకు బాబు సూచన
ఒకరిపై మరొకరు బహిరంగ విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువుతీయొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలకు హితవు పలికారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఇరు ప్రాంతాలకు చెందిన ముఖ్యనేతలతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మలిదశ 'తెలుగు వారి ఆత్మగౌరవ యాత్ర', ఎర్రబెల్లి, సీఎం రమేష్, కోడెల మధ్య విభేదాలు చర్చకు వచ్చాయి. పార్టీ వ్యతిరేక విధానాలకు ఎవరూ పాల్పడవద్దని ఆయన సూచించారు. పార్టీ అంతర్గతంగా చర్చించుకునే విషయాలపై బహిరంగంగా మీడియాకు ఎక్కవద్దని అన్నారు.