ఆర్థికాంశాల గోప్యతలో స్విట్జర్లాండే ఫస్టు
ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి అత్యంత గోప్యత పాటించే దేశంగా స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ట్యాక్స్ జస్టిస్ నెట్ వర్క్ అనే సంస్థ ప్రపంచ దేశాలకు సంబంధించి, ఫైనాన్షియల్ సీక్రసీ ఇండెక్స్ ను రూపొందించింది. ఈ సూచీలో లక్సెంబర్గ్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించగా, హాంగ్ కాంగ్ తృతీయ స్థానంలో నిలిచింది. భారత్ 32వ స్థానాన్ని దక్కించుకుంది. అమెరికా, జర్మనీ, జపాన్, సింగపూర్ లు టాప్ టెన్ లో స్థానం సంపాదించుకున్నాయి.