ఏవీఎస్ అంత్యక్రియలు పూర్తి
ప్రముఖ కమెడియన్ ఏవీఎస్ అంత్యక్రియలు హైదరాబాదులోని పంజాగుట్ట శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. చివరిసారిగా కుటుంబసభ్యులు, బంధువులు, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. అంతకుముందు మణికొండలోని ఆయన నివాసం నుంచి ఏవీఎస్ అంతిమయాత్ర జరిగింది.