జీఎంవోను బహిష్కరిస్తున్నాం: వైఎస్సార్ సీపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీఎంవోను బహిష్కరిస్తున్నాం: వైఎస్సార్ సీపీ

రాష్ట్ర విభజన కోసం కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జీఎంవో)ను బహిష్కరిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ తెలిపింది. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు కొణతాల, మైసూరా రెడ్డి మాట్లాడుతూ తమకు కేంద్ర హోంశాఖ నుంచి జీఎంవోకు హాజరుకావాలంటూ లేఖ వచ్చిందని, కానీ దానిని తాము తిరస్కరిస్తున్నామని వారు తెలిపారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతి పార్టీ తమతో కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు. జీఎంవో తమకు సమ్మతం కాదని, విభజన కోసం వేసే ఏ అడుగుకూ తాము సహకరించమని వారు స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రమే తమకు సమ్మతమని వారు తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి రాసిన లేఖను వారు ప్రదర్శించారు.

More Telugu News