బాబా రాందేవ్ సహాయకుడిపై సీబీఐ ఛార్జిషీటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబా రాందేవ్ సహాయకుడిపై సీబీఐ ఛార్జిషీటు

యోగా గురు బాబా రాందేవ్ సహాయకుడు బాలకృష్ణపై డెహ్రాడూన్ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జిషీటు నమోదైంది. నకిలీ పత్రాలతో పాస్ పోర్టు పొందాడని అతనిపై అభియోగాలు మోపారు. ఇతనితో పాటు నరేష్ చంద్ర ద్వివేది అనే వ్యక్తిని కూడా సహ నిందితునిగా చేర్చారు. వీరిపై ఐపీసీ 120 (బి), 420, 468, 471 సెక్షన్లతో పాటు 1967 పాస్ పోర్టు చట్టంలోని సెక్షన్ 12 కింద కేసు నమోదుచేశారు. కేసు విచారణను డిసెంబర్ 5 కు వాయిదా వేశారు.

More Telugu News