Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముజఫర్ నగర్లో మళ్లీ మతచిచ్చు.. నలుగురు మృతి

నెల రోజుల వ్యవధిలోనే ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ప్రాంతంలో మళ్లీ మత ఘర్షణలు తలెత్తాయి. సెప్టెంబర్ లో జరిగిన అల్లర్లలో 60 మంది వరకూ ప్రాణాలు కోల్పోగా.. తాజాగా బుధవారం రాత్రి రేగిన మతచిచ్చులో ఒక మహిళ సహా నలుగురు మృతి చెందినట్లు సమాచారం. ముజఫర్ నగర్ సమీపంలోని భూదాన ప్రాంతంలో రెండు మతాలకు చెందిన వారి మధ్య ఘర్షణలు తలెత్తాయి. పోలీసులు 144 సెక్షన్ విధించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

More Telugu News