ఎయిర్ పోర్టులో 2 కోట్ల విలువైన ఎర్రచందనం సీజ్
చెన్నైలోని అన్నా ఎయిర్ పోర్టులో సింగపూర్ వెళుతున్న షేక్ దావూద్ అనే ప్రయాణికుడి నుంచి 40 కేజీల ఎర్రచందనాన్ని నిన్న అర్థరాత్రి స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అన్నా విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ దావూద్ ను తనిఖీ చేయగా, 40 కేజీల ఎర్రచందనం అతని లగేజీలో కనుగొన్నట్టు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు 2 కోట్ల రూపాయల ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.