Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్రమంత్రి చిరంజీవికి చేదు అనుభవం

శ్రీకాకుళం జిల్లా రాజాం వద్ద జీఎమ్ఆర్ ఐటీ కళాశాలలో కేంద్రమంత్రి చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. తమను పలకరించకుండా వెళుతున్నారని విద్యార్ధులు చిరంజీవిపై కంకర రాళ్ళు విసిరారు. వెంటనే భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దాంతో, విద్యార్ధులకు, భద్రతా సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరిగింది.

More Telugu News